Telangana

నాగార్జున ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థుల సందడి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం, దర్గా నాగార్జున ‘పాఠశాలలో గురువారం రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థుoలందరూ గోపికలు, కృష్ణుల వేషధారణలో పాఠశాల (ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. చిన్ని చిన్ని విద్యార్థులందరూ వారి మాటలు, డాన్స్లతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెప్పించారు. తర్వాత చక్కని వేషధారణలతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కొంతమంది విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ కృష్ణాష్టమి గురించి, శ్రీ కృష్ణుని లీలల గురించి పిల్లలకు తెలియజేశారు. చివరిగా విద్యార్థులచే ఉట్టి కొట్టించి, కోలాటలు ఆడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఛైర్మన్ కృష్ణ గౌడ్, ప్రిన్సిపల్ సుంధరి, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

నార్సింగ్ బ్రాంచ్ లో…..

నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్ శారదా విద్యా నికేతన్ లో గురువారం రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించగా కౌన్సిలర్ ఉషారాణి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ లు ముఖ్య అతిధులు గా విచ్చేశారు.శ్రీకృష్ణాష్టమి వేడుకల్లు ప్రీ ప్రైమరీ విద్యార్ధులు కృష్ణ, రాధా, గోపిక వేషధారణ లో అందoగా ముస్తాబై బృందావనాన్ని తలపించారు. చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, నృత్యాభినయం కార్యక్రమాల్లో పాల్గొని అందరిని అలరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు చేసిన నృత్య ప్రదర్శనలు తల్లితండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఉషారాణి మాట్లాడుతూ పాఠాశాలలో ప్రతీ పండుగను నిర్వహించడం ద్వారా మన సంస్కృతి భావి తరాలకు తెలుస్తుందని, తనకు ఈ వేడుక చూస్తే బృందావనం గుర్తుకు వచ్చిందని ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి స్కూల్ ఉండటం తనకు గర్వకారణం అని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు. కరస్పాండెంట్ పూర్ణిమా భరత్ కుమార్ కార్యక్రమానికి విచ్చేసిన తల్లితండ్రులకు విద్యార్ధులకు శ్రీ కృష్ణాష్టమి విశిష్టతను శ్రీ కృష్ణుడి జీవితం లో ఘట్టాలను వివరించి, విద్యార్ధులు స్ఫూర్తి పొందాలని సూచించారు. అశోక్ యాదవ్ మాట్లాడుతూ పాఠాశాలలో ఇలాంటి కార్యక్రమాలు చెయ్యడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తను పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. అందoగా అలంకరించిన ఉట్టి ని ఉత్సాహంగా కొట్టి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ఆశ్రిత సంప్రదాయబద్దంగా శ్రీ కృష్ణుడికి వెండి గిన్నెలలో వెన్నను సమర్పించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

14 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

15 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago