రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి…
హైదరాబాద్:
కరోనా సమయంలోనూ ప్రభుత్వ శాఖ లతో సమానంగా విధులు నిర్వహించిన జర్నలిస్టు లకు ఎలాంటి సహాయం చేయకపోవటం శోచనీయమని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా లో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు… ప్రైవేట్ ఉపాధ్యాయులతో ,పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఆదుకున్న ప్రభుత్వం .. జర్నలిస్టుల విషయంలో ఎందుకు తాత్సర్యం చేస్తుందోనని ప్రశ్నించారు.రూ.10 వేల పారితోషికంతో పాటు 25 కేజీల బియ్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు . కరోనా విపత్తులో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు షరతులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన నగదును అందజేయాలన్నారు .
