Telangana

సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం

ముదిరాజులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్..

బీసీ గణనతో పెరగనున్న రాజకీయ అవకాశాలు 

ఐక్యతతో ముందుకు వెళితేనే గుర్తింపు : నీలం మధు ముదిరాజ్..

శంకర్ పల్లి లో ముదిరాజ్ సంక్షేమ భవనం ప్రారంభం..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీలో ముదిరాజ్ సంక్షేమ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు పెద్దపీట వేసి ముదిరాజ్ జాతి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో కొన్ని పార్టీలు ముదిరాజులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు టికెట్లు ఇచ్చి గుర్తింపునిచ్చిందని కొనియాడారు. అసెంబ్లీలో ముదిరాజులకు అవకాశం కల్పించడమే కాకుండా స్థానిక సంస్థలలో మన ప్రాతినిధ్యం పెరిగేందుకు బీసీ కులగణనను ప్రారంభించారని గుర్తు చేశారు. బీసీ కులగనన పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ముదిరాజుల బీసీ ల ప్రాతినిధ్యం పెరిగి రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయి అన్నారు. గత ఎన్నికల ముందు ముదిరాజులకు రాజకీయ గుర్తింపు కోసం ఐక్యంగా పోరాడిన మన జాతి బిడ్డలంతా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఐకమత్యంతో ముందుకు కదిలితే మన హక్కులను సాధించుకోవచ్చని స్పష్టం చేశారు. మన గుర్తింపు సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మనమంతా మద్దతుగా నిలబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులిమామిడి రాజు, శంకర్పల్లి మండలాధ్యక్షుడు తలారి మైసయ్య, అందే బాబయ్య, డాక్టర్ మద్దెల సంతోష్, రావులపల్లి నారాయణ,శ్రీకాంత్,నరేష్,జంగయ్య, రాములు, మన్నే వెంకటేశ్, లింగం, స్థానిక ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago