Telangana

రుద్రారం సిద్ధి వినాయకుడికి కాసుల వర్షం

-వైభవంగా గణేష్ గడ్డ హుండీ లెక్కింపు

-102 రోజుల్లో రూ. 36.28 లక్షల ఆదాయం 

-పారదర్శకంగా నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు

-ఆలయాభివృద్ధి, అన్నదానానికి నిధుల వినియోగం: ఈవో లావణ్య

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధి వినాయక దేవాలయం (గణేష్ గడ్డ) హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం ఆలయ ఈవో లావణ్య, సంగారెడ్డి ఇన్స్పెక్టర్ రంగారావుల పర్యవేక్షణలో నిర్వహించారు .శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు నవరాత్రుల సందర్భంగా 90 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం 36 లక్షల 28 వేల 312 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో లావణ్య తెలిపారు.అనంతరం ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ రుద్రారంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ సిద్ధి గణపతి భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారని ,ఇటీవల జరిగిన వినాయక చవితి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా విచ్చేసిన భక్తులు స్వామివారికి కానుకలు, అన్నదాన విరాళాలు సమర్పించుకున్నారని చెప్పారు. వచ్చిన ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నట్లు ఈవో లావణ్య తెలిపారు ​ఈ కార్యక్రమంలో ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, అర్చకులు సంతోష్ పంతులు, జగదీష్ పంతులు, అయ్యప్ప పంతులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago