Telangana

వినాయ‌క మండ‌పాల‌ను ద‌ర్శించుకున్న సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ క‌న్వీన‌ర్ కంజ‌ర్ల కృష్ణ‌మూర్తి

రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి :

గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు జోరుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని భార‌తీన‌గ‌ర్ డివిజ‌న్ లోని 91 వినాయ‌క మండ‌పాల‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించార‌. ఆయా యూత్ అసోసియేష‌న్ల‌కు సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ క‌న్వీన‌ర్ కంజ‌ర్ల కృష్ణ‌మూర్తి అన్న ప్ర‌సాదాల కోసం చందాలు అంద‌జేశారు. అనంత‌రం కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ వినాయక నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మట్టి గణపతులు పెట్టిన యూత్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌ను స‌త్క‌రించారు . వచ్చే సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన గణనాధుని పూజించాలని కోరారు. యూత్ అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో ఐకమత్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉంద‌న్నారు . నవరాత్రులు ఎంతో అద్భుతంగా, నిర్విఘ్నంగా జరిగాయని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి పనులు ఏటువంటి విజ్ఞాలు లేకుండా జరగాలని కోరుకున్న‌ట్లు తెలిపారు. అనుకున్న పనులలో విజయం సాధించాలని వేడుకున్న‌ట్లు వెల్ల‌డించారు . వినాయకుడి కృపా కటాక్షాలతో భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణనాధుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

16 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

19 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

21 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

21 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

21 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago