Telangana

పటాన్చెరు లో ఘనంగా సురక్షా దినోత్సవం

_శాంతి భద్రతలో మేటి తెలంగాణ పోలీస్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఏర్పడటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు విభాగంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అయిన ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని అన్నారు. ప్రధానంగా పోలీసు శాఖపై ప్రజలకు మంచి అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రారంభించిన ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలు పోలీసులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు వీలు ఏర్పడిందని అన్నారు. ఆధునాతన టెక్నాలజీని వినియోగించుకుని తెలంగాణ పోలీస్ దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు.  ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే హాక్‌ఐ, లాస్ట్‌ రిపోర్టు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వేదికల ద్వారా ఫిర్యాదు చేస్తూ.పోలీసుల సేవలు పొందుతున్నారని తెలిపారు.

మరో పక్క క్షేత్రస్థాయిలో ఉండే పెట్రోలింగ్‌ సిబ్బంది ఇంటివద్దకే వెళ్లి బాధితుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామంలో నేరం జరిగితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణమే చర్యలు తీసుకునే వ్యవస్థ ఏర్పడిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. సంస్థాగతపరంగా పోలీసు శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, వేలాది పోస్టులు భర్తీ చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం రక్తదానం చేసిన యువకులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి భీమ్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సురేందర్ రెడ్డి, వేణు కుమార్, వినాయక రెడ్డి, డి ఐ లల్లు నాయక్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ రెడ్డి, ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీ అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మెరాజ్ ఖాన్, సందీప్, సునీల్ రెడ్డి, రామకృష్ణ, యువకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago