దేవాలయం నిర్మాణానికి రూ:5 లక్షలు అందజేత…
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
కంది(సంగారెడ్డి జిల్లా):
సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని చేర్యాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ ఆలయాన్ని ఆదివారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించామ .ఈ సందర్భంగా ఆలయ భవనం నిర్మాణానికి గాను తనవంతుగా రూ 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, నాగభూషణం మాట్లాడుతూ గ్రామంలోని రామాలయ నిర్మాణానికి అందరి సహకారాన్ని తీసుకుంటున్నామని అన్నారు.
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నీ తాము కలిసి ఆలయ అభివృద్ధి ,భవన నిర్మాణానికి సహకరించాలని కోరడంతో నేడు ఆలయాన్ని సందర్శించి తనవంతుగా ఐదు లక్షలు అందజేశారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం లోనే కాకుండా పక్కనే ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా తమ స్వగ్రామం లోని ఆలయానికి కోరిన వెంటనే ధనసహాయం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్, గ్రామ సర్పంచ్ ప్రవీణ్, నాయకులు చంద్రారెడ్డి, ప్రభాకర్, రాములు, శంకర్, శ్రీధర్ ,హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…