వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్….
హైదరాబాద్:
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్య లో కేసులు , వందల సంఖ్య లో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోపక్క 45 ఏళ్ల పైబడిన వారికీ వాక్సిన్ అందజేస్తున్నప్పటికీ కేసులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారికీ ఫ్రీ వాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మే 01 వ తేదీ నుండి ప్రభుత్వ , ప్రవైట్ హాస్పటల్స్ లలో ఈ వాక్సిన్ ఇవ్వనున్నారు. కాగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నారు. ఆరోగ్యసేతు, కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.