– విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు ముస్కాన్
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు ముస్కాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ విస్తృత స్థాయి సమావేశంలో పటాన్ చెరు డివిజన్‌కు చెందిన ముస్కాన్ ను జిల్లా కమిటీ సభ్యురాలిగా నూతనంగా ఎన్నికయ్యారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్కాన్ డిమాండ్ చేశారు.విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారంకోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో విద్యార్థుల పక్షాన పోరాడుతామన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…