సేవలను గుర్తించిన ప్రణవి ఫౌండేషన్…

Hyderabad

సేవలను గుర్తించిన ప్రణవి ఫౌండేషన్
– కొండల్ కు సర్టిఫికెట్ అందజేత

పటాన్ చెరు:

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసే కొండలు కు ప్రణవి ఫౌండేషన్ సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ చెందిన ప్రణవి ఫౌండేషన్ నిర్వాహకుడు జైన్ కొవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ టెస్ట్ ల,వ్యాక్సినేషన్ వద్ద డాటా ఎంట్రీ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కొండల్ సేవలను గుర్తించి సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కొండల్ మాట్లాడుతూ…. ప్రణవి ఫౌండేషన్ సర్టిఫికేట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. సర్టిఫికెట్ రాకతో మరింత బాధ్యత పెరిగింది అన్నారు. ఇతరులకు సహాయం చేయడంతో ఎంతో ఆనందం కలుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *