ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు
తాజా మాజీ మున్సిపల్ పాలకవర్గాలకు ఘన సన్మానం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రజాస్వామ్యంలో పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే తిరిగి అవకాశం ఇస్తారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలకవర్గాలను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల కాలంలో నూతనంగా ఏర్పడిన అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుని అభివృద్ధికి ప్రత్యేకగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రతి పాలకవర్గ సభ్యుడు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్నారని అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే పంథాలో కొనసాగాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల పరిధిలో దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగేష్,మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, తొంట అంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు లలిత సోమిరెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు దేవానందం, రవీందర్ రెడ్డి, యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సోమిరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్,.పాండు, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…