గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం – విద్యార్థులకు నియామక పత్రాల అందజేత

పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మశీ, స్కూల్ ఆఫ్ సైన్స్ లు శుక్రవారం సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డే) ఘనంగా నిర్వహించాయి. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన ఇంజనీ లింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశాయి. 2020-21 విద్యా సంవత్సరంలో దాదాపు 165 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతమ్ లో ప్రాంగణ […]

Continue Reading

పల్లె ప్రగతి కి ప్రతిబింబంగా కనిపిస్తుంది…

చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతి కి ప్రతిబింబంగా కనిపిస్తుంది… – గ్రామంలో పనితీరు ప్రగతికి నిదర్శనం – జిల్లా కలెక్టర్ హనుమంతరావు పటాన్ చెరు: చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతి ప్రతిబింబంగా నిలుస్తోందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కితాబునిచ్చారు. గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజు పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ […]

Continue Reading

పేద కుటుంబ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించిన దేవేందర్ రాజు

పటాన్ చెరు పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తన వంతు సాయంగా ఆర్థిక సాయం అందచేసేందుకు యండిఆర్ ఫౌండేషన్ ముందుటుందని ఫౌండేషన్ ఛైర్మన్ ,పటాన్ చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు అన్నారు.సామాజిక సేవా కార్యక్రమాలతో భాగంగా పేద ప్రజలకు అండగా ఎండీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణం కోసంపదిహేను వేల ఆర్థిక సహాయం అందజేశారు. పటాన్ చెరు పట్టణంలోని చైతన్యనగర్ లో ఉంటున్న ఓ కుటుంబ ఇంటి నిర్మాణం కోసం […]

Continue Reading

వారం రోజుల్లో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నోవాపాన్ చౌరస్తా, పాత మార్కెట్, శ్రీ రామ్ నగర్ కాలనీల పరిధిలో జాతీయ రహదారి పై గల మురుగు నీటి సమస్యను వారం రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారుల కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు. జిహెచ్ఎంసి, జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, స్థానిక కార్పొరేటర్ పెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన స్వయంగా సమస్యలను పరిశీలించారు. వర్షాకాలంలో మురుగు నీటితోపాటు […]

Continue Reading

రుద్రారం లో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు…

పటాన్ చెరు: పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పల్లెలు, పట్టణాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ ఆశయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ పటాన్ చెరు మండలం రుద్రారం పల్లె ప్రగతిలో పాల్గొని, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ… పట్టణాల కన్నా పల్లెలు బాగున్నాయని, గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పోటాపోటీగా పనిచేస్తున్నారన్నారు. […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం భానురు గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు […]

Continue Reading

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది

మియపూర్ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్, మియపూర్ బిజెపి కార్యాలయం వద్ద జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ డా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో ఆయన చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. […]

Continue Reading

జిహెచ్ఎంసి చెత్త సేకరణ సిబ్బందికి సేఫ్టీ కిట్లు పంపిణీ

పటాన్ చెరు జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్న చెత్త సేకరణ సిబ్బందికి మంగళవారం క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సేఫ్టీ కిట్స్ ను పంపిణీ చేశారు. అనంతరం నూతన చెత్త సేకరణ ఆటోలను సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ చెత్త సేకరణ సమయంలో చేతులకు గ్లోవ్స్, మాస్కు, షూస్ ధరించాలని సూచించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకూడదని సూచించారు. జిహెచ్ఎంసి పరిధి లోని […]

Continue Reading

గీతమ్ లో బీఎస్సీ , ఎమ్మెస్సీ అడ్మిషన్లు

పటాన్ చెరు: స్కూల్ ఆఫ్ సైన్స్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు మంగళవారం వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలతో నిర్మించిన అధునాతన భవనంలో టీసీఎస్ సహకారంతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ కాగ్నిటివ్ సిస్టమ్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ విశ్వవిద్యాలయ సహకారంతో బీఎస్సీ (బ్లెండెడ్) […]

Continue Reading

భావితరాలకు ఆక్సిజన్ అందిచాలి – జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి

పటాన్ చెరు: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, పటాన్ చెరు జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోచారం, ఐనోల్, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల గ్రామాలలో జడ్పీ వైస్ చైర్మన్, జెడ్పిటిసి, ఎంపీపీ లు 7వ విడత హరితహారం, 4వ విడత పల్లె ప్రగతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో హరితహారంలో భాగంగా […]

Continue Reading