పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు పట్టణంలోని ప్రముఖ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లోకకళ్యాణార్థం, గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుతూ ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.నవరాత్రి ఉత్సవాల తొలిరోజు సందర్భంగా అమ్మవారు భక్తులకు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి దివ్య మంగళ రూపంలో దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పూజా వేదికపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకోవడానికి వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి విశేష స్నాపన తిరుమంజనం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, వేదమంత్రోచ్ఛారణల నడుమ కుంకుమార్చన పూజలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజల్లో అమ్మవారిని ఆరాధించారు. సాయంత్రం వేళ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం, విశేష ధూపదీప నైవేద్యాలు, మహా హారతి కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు.ప్రతిరోజూ అమ్మవారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని, ప్రత్యేక పూజలతో పాటు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, పూజల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…