Categories: politics

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మరో వారం రోజులు పొడిగింపు…

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మరో వారం రోజులు పొడిగింపు…
  • తెలంగాణలో కరోనా వ్యాప్తి
  • గత నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ
  • రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
  • పలు దఫాలు పొడిగింపు
  • ఈ నెల 15 వరకు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించారు. రాత్రి పూట కర్ఫ్యూ ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అటు, కేంద్రం చర్యల నేపథ్యంలో తెలంగాణ సర్కారు తాజా మార్గదర్శకాలు వెలువరించింది. వివాహ వేడుకలకు 100 మందికి మించి హాజరుకారాదని స్పష్టం చేసింది. అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనరాదని పేర్కొంది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత కార్యక్రమాలపై నిషేధం విధించింది

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago