politics

రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అభివృధి శూన్యం…

పటాన్‌చెరు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అభివృధి శూన్యమని, కేసీఆర్‌ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ప్రచార కమిటి అధ్యక్షులు కొత్త బస్వరాజ్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారని తెలిపారు. అంతే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చకపోగా, రోజు రోజుకు కొత్త హమీలిస్తు ప్రజలను అమాయకులను చేసి మానసిక స్థితులతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఏమయ్యాయి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంలో జ్యప్యం ఎందుకు అని ప్రశ్నించారు.

రైతు రుణ మాఫీ చెయ్యకపోవడంలో అర్థం ఏమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న సమస్యలు రోజంతా చెప్పిన మిగులుతాయని పేర్కొన్నారు. ఇన్ని సమస్యల వల్ల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండక ఎలా ఉంటారని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ భూములను బేరం పెట్టడం అంటే ఆ రాష్ట్రం త్వరలో దివాలా తీస్తుందని, ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను చూస్తేనే ఈ ప్రభుత్వం పని తీరు ఏమిటో అర్థం అవుతుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన విధంగా పరిపాలన జరపాలని అన్నారు. లేదంటే అతి త్వరలో గద్దె దిగే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago