వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు…
– శ్రీ రామలింగేశ్వర ఆలయంలో హనుమాన్ కి ప్రత్యేక పూజలు
పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణం టోల్ గేట్ సమీపంలోని మంజీర క్యాంపస్ లోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో కొలువైన హనుమాన్ కి ఆలయ అర్చకులు బస్వరాజ్,మహేష్ ,గణేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేయడం జరుగుతుందని,దీనికి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల రాజు తదితరులు పాల్గొన్నారు.