ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే…

Hyderabad

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
– ప్రారంభమైన కోవిడ్ వైద్యసేవలు
– అందుబాటులోకి ఆక్సిజన్ పడకలు
– ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

పటాన్ చెరు:

పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు ప్రారంభమైనట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా 70 ఆక్సిజన్ సదుపాయం గల పడకలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం వైద్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని కోవిడ్ వార్డు ని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న తరుణంలో నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చికిత్స కోసం ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడంతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్యంతో పాటు ఉచిత భోజన వసతి, సహాయకులకు వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రెఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా కోవిడ్ వార్డు ఏర్పాటు చేస్తున్నందున ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుంధర, వైద్యులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *