Telangana

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం:

జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘం తొలి పాలకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మండల పరిషత్ గా ఉన్న జిన్నారం నేడు మున్సిపల్ గా మారడం జరిగిందని ఇందుకు అనుగుణంగా ప్రతి వార్డు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడాలని.తదనంతరం ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలని ప్రజాప్రతితులకు సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ మున్సిపాలిటీని అభివృద్ధికి ప్రత్యేకగా తీర్చిదిద్దాలని విన్నవించారు. అభివృద్ధి పనులు సమస్యల పరిష్కార అంశంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

8 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago