పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
క్రీడలు దినచర్యలో భాగం కావాలని, క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో నూతన సంవత్సరం సందర్భంగా నిరంజన్ ఎలెవన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 31స్ట్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎంఎల్ఏ జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి పెద్ద పీట వేయడంతో పాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వీటితోపాటు పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం లలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత 17 సంవత్సరాలుగా యువత కోసం 31 నైట్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు అనంతరం విజేతలుగా నిలిచిన నిరంజన్ 11, నిలిచిన కేబీఎన్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…