పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ ఏడుపాయల దుర్గా భవాని దేవాలయాన్ని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోహన్ రెడ్డి ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ సమీపంలో అమీన్పూర్ మండలం వడక్పల్లి గ్రామ సర్పంచ్ లలితా మల్లేష్ అధ్వర్యంలో నిర్మించిన నూతన షెడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, కిష్టారెడ్డిపేట సర్పంచ్ కృష్ణ, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…