_క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి దశ నుండి చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఫిట్టేస్ట్ ఆఫ్ తెలంగాణ, పటాన్చెరు మండలం భానురు గ్రామంలో మహావీర్ మార్షల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరాక దారుఢ్యం లభిస్తుందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడా పోటీల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వం తరఫున క్రీడా పోటీలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనబోయే నియోజకవర్గ క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా మూడు మినీ స్టేడియాల నిర్మాణ పనులు ప్రారంభించామని గుర్తు చేశారు.రెండు క్రీడా పోటీల నిర్వహణకు ఎమ్మెల్యే జిఎంఆర్ 3 లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు.ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, భానురు సిఐ వినాయక్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…