Telangana

ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_గడపగడపకు సంక్షేమ పథకాలు..

_పటాన్చెరు గడ్డ..బిఆర్ఎస్ అడ్డ..

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గడప గడపకు సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకుంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 60 ఏళ్లలో సాధించని ప్రగతిని 10 ఏళ్లలో చేసి చూపించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు జిమ్మిక్కులు చేసిన టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరని అన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాకున్నా తెలంగాణలో అమలు చేస్తామంటూ ప్రగాల్బాలు పలకడం ప్రతిపక్షాలకే చెల్లిందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయని నమోదు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago