గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి కృషి
మనవార్తలు ,పటాన్ చెరు:
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం పాటి గ్రామంలో పాటి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాటి క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఆదివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి కోసం మూడు మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాటి గ్రామ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం నిర్మాణం పనులను ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో పటాన్చెరు నియోజకవర్గం స్పోర్ట్స్ హబ్ గా మారబోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సి ఐ లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, స్వామి గౌడ్, భూపాల్ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, శ్రీకాంత్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…