Districts

గీతంలో మైక్రోకంట్రోలర్ పుస్తకావిష్కరణ

మనవార్తలు,పటాన్‌చెరు:

విద్యావేత్త, ఎన్ఐటీ వరంగల్ పూర్వ అధ్యాపకుడు ప్రొఫెసర్ పువ్వాడ రమేష్ రచించిన మైక్రోకంట్రోలర్ అండ్ ఇంటర్ఫేసింగ్ అనే పుస్తకాన్ని శుక్రవారం గీతం కెరీర్ గైడైన్స్ సెల్ కాన్ఫరెన్స్ హాల్లో గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ఆవిష్కరించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ, సీఎస్ఈ విభాగాధిపతులు ప్రొఫెసర్ టీ.మాధని, ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్, ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ వైద్యంలో సమకాలీన అనువర్తనానికి సంబంధించిన అంశాలపై ప్రొఫెసర్ రమేష్ ఆలోచనల సంకలనమే ఈ పుస్తకం అన్నారు. కాగా రచయిత వరంగర్ ఎన్ఐటీలో పనిచేసిన ప్రొఫెసర్ పువ్వాడ రమేష్, ఆ తరువాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో సేవలందించారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో బోధన, పరిశోధనలో దాదాపు 40 ఏళ్ళకు పైగా అనుభవం ఆయన సొంతం, బయో మెడికల్ ఇంజనీరింగ్ పరిశోధనలో ప్రొఫెసర్ రమేష్ కు అపారమైన అనుభవం ఉంది. అంతర్జాతీయ జర్నల్స్, సదస్సులో ఆయన దాదాపు వందకు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. విద్య, పరిశోధన రంగాలలో ఆయనకున్న అనుభవాన్ని పంచుకునేందుకు గాను వివిధ దేశాలను ఆయన సందర్శించారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago