Telangana

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని గెలిపించాలి_బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య.

-హైదరాబాదులో ఆర్ కృష్ణయ్యను కలిసిన నీలం మధు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆర్ కృష్ణయ్య నివాసానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థి నీలం మధును ఆర్ కృష్ణయ్య సాదరంగా స్వాగతించి అభినందించారు. ఎంపీ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి, తనకు అండగా నిలవాలని ఆర్ కృష్ణయ్యను నీలంమధు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో బీసీలకు అవకాశం దక్కలేదు అన్నారు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత నీలం మధుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అరుదైన అవకాశం రావడం హర్ష నియమన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 64శాతం బిసిల ఓట్లు ఉన్నాయని, ఏదైనా పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వాలంటే భయపడతాయన్నారు. అలాంటిది బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యువనేత నీలంమధును గుర్తించిన కాంగ్రెస్ ఆధినాయక్తవానికి అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎంపీ ఎన్నికల్లో నీలంమధును గెలిపించుకుంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీసీ కులాలు, ఇతర అన్ని కులాల మద్దతుదారులు సానుభూతిపరులు ఐక్యమై మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని పార్లమెంటుకు పంపించాలని కోరారు. మధును పార్లమెంటుకు పంపితే ఆయన మద్దతు తీసుకొని దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం పోరాడుతామని   ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘం నాయకులు సుధాకర్, నంద గోపాల్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల రామకృష్ణ, తదితరులు నీలం మధును శాలువాలతో సన్మానించి, సంఘీభావం తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago