పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతర కార్యక్రమాల్లో నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ జాతరలు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. గ్రామాల్లో జరిగే ఉత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు ప్రజలంతా ఐక్యమత్యంగా కలిసి ఉంటారన్నారు. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.నియోజకవర్గంలో నూతన దేవాలయాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోధ్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి,కిష్టయ్య, నాగభూషణం,మల్లేష్,సత్తయ్య, దేవరాజ్,రవి,భద్రయ్య, నవీన్,మధు, ప్రవీణ్,జాతర నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…