Districts

జోరుగా .. హుషారుగా ఫ్రెషర్స్ డే…

మన వార్తలు ,పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు విభాగాల వారీగా శనివారం ఫ్రెషర్స్ డేని జరుపుకున్నారు . సీఎస్ఈ విద్యార్థులు ‘ ఫియస్టా ‘ పేరుతో , ఈఈసీఈ ‘ హవా ‘ , మెకానికల్ ‘ రాయల్ ‘ , ఏరోస్పేస్ – సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి ‘ డొమినియన్ ఫియసా ‘ పేరిట ఈ ఫ్రెషర్స్ డే ఉత్సవాలను జరుపుకున్నారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఆయా విభాగాలను సందర్శించి , వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు . విద్యార్థులను ఉత్సాహపరిచేలా ప్రసంగించడంతో పాటు ప్రతి క్షణం మంచి అనుభూతిని ప్రోదిచేసుకోవాలని , ఉల్లాసంగా గడపాలని సూచించారు . ఆయా విభాగాల అధిపతులు ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ కె . మంజునాథాచారి , ప్రొఫెసర్ బీఎస్కే ప్రసాద్ , డాక్టర్ పి.శ్రీనివాస్ తదితరులు కేక్లు కట్ చేసి విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు .

అతిథ్య విభాగం జనరల్ మేనేజర్ మారియో చెరిమన్ కూడా వారికి జతకలిశారు . ‘ ఫ్రెషర్స్ డే అనేది మరుపురానిది . ఇది విద్యార్థి జీవితంలో కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది . నూతన విద్యార్థులకు సాదర స్వాగతం పలికే రోజు . సీనియర్ , జూనియర్ విద్యార్థులంతా ఐక్యంగా జరుపుకునే వేడుక అంటూ వారు విద్యార్థులను ఉత్సాహపరిచారు . సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఉల్లాసంగా , ఉత్సాహంగా సాగి విద్యార్థులలో జోష్ను నింపాయి . విద్యార్థినీ – విద్యార్థుల కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది . ఫ్రెషర్స్తో కలిసి సీనియర్ విద్యార్థులు అద్భుతమైన ర్యాంప్ వాక్ , పాటలు , నృత్యాలు , స్కిట్లు ప్రదర్శించారు . సంప్రదాయ దుస్తులలో చేసిన కూచిపూడి , భరతనాట్యం అందరి మన్ననలు చూరగొన్నాయి . చివరగా పసందెన విందుతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి .

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago