– 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
అభినందించి సత్కరించిన కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పది ఫలితాలలో మండలంలోని ముత్తంగి కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 30న వెల్లడించిన పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని ముత్తంగి గ్రామంలోని కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు 40 మందికి పైగా 500 పైగా నే మార్కులు సాధించడంతోపాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎన్నపు జోష్న (577) పాఠశాల టాపర్ గా నిలువగా, బొర్రా లాస్య (567) తెర్లి వర్షిని (563) మంత్రి కార్తిక (568)(557)బొడ్డేపల్లి జోత్స్న(556) పడాల విశ్వాంత్(555) నాయక్ వాడి విద్యాసాగర్ (550) మార్కులు సాధించి తమ సత్తా చాటారు. గురువారం రాత్రి పాఠశాలలో ప్రిన్సిపల్ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కృష్ణవేణి, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని టాపర్ గండించిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజు సంగాని మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు చే బోధించడంతోనే ఇది సాధ్యమని అదే కాక విద్యార్థులు సైతం కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించడం పట్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ప్రిన్సిపల్ రాజేష్ మాట్లాడుతూ 82 మంది విద్యార్థులు 10 పరీక్షలు వ్రాయగా అందులో 40 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించి 100 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పాఠశాల అత్యుత్తమ విద్య ప్రమాణాలు పాటించడం వల్లనే ఈ విజయం కృష్ణవేణి వశమైందన్నారు. విద్యార్థులను ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయడంతో పాటు ఇంటి వద్ద వారి తల్లిదండ్రులు సైతం ప్రత్యేక శ్రద్ధ కనపరచడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…