– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో కలకత్తా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమ్లాన్
మనవార్తలు,పటాన్ చెరు:
క్వాంటం కంప్యూటర్ అధిక పనితీరు గల అత్యుత్తమ సూపర్ కంప్యూటర్ల కంటే వేగంగా గణిస్తుందని కలకత్తా విశ్వవిద్యాలయంలోని ఎ.కె.చౌదరి స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ అమ్లాన్ చక్రబర్తి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ క్వాంటమ్ ఇంటెలిజెన్స్ ‘ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . క్వాంటం కంప్యూటర్ క్వాంటం మెకానిక్స్ నియమాల ఆధారంగా గణనలను నిర్వహిస్తుందని ఆయన చెప్పారు .
ఒక క్వాంటా ( విద్యుదయస్కాంత తరంగం లేదా కణం ) ద్వంద్వ స్వభావాన్ని ఇది ప్రదర్శిస్తుందని , ఇది తరంగంగా , కణంగా ఏకకాలంలో ప్రవర్తిస్తుందన్నారు . ఇవి సూపర్పొజిషన్ , ఎంటాంగిల్మెంట్ అనే క్వాంటం ఫిజిక్స్ సూత్రాలను అనురిస్తాయని చెప్పారు . క్వాంటం మెషిన్ లెర్నింగ్ను ఆర్థిక , లాజిస్టిక్స్ , తయారీ , వాతావరణ అంచనా , విద్యుత్ , రసాయనాలు , ఫార్మాస్యూటికల్ , ఆటోమోటివ్ వంటి పరిశ్రమలలో వినియోగిస్తున్నట్టు డాక్టర్ అమ్లాన్ వివరించారు . తొలుత , అతిథిని సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ సత్కరించగా , డాక్టర్ ఎస్.డి.వరప్రసాద్ సమన్వయం చేశారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…