శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని వాజపేయి చిత్ర పట్టనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయత, ఉదాత్తత, మానవత కలగలిసిన మేరుశిఖరమని ప్రత్యర్థులను సైతం తన వాగ్దాటితో మంత్రముగ్దులను చేయడమే కాకుండా రాజకీయాలను కవిత్వాన్ని సమతూకం చేస్తూ దేశ రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా నిలిచిన మహనీయులు అని అన్నారు.
బిజెపి పార్టీని స్థాపించి అదికారాన్ని సాదించి భారత ప్రధానిగా దేశాన్ని దేవాలయంగా సమాజాన్ని కుటుంబంగా కనీసం సొంత ఇల్లు కూడా లేని బ్రమ్మచారిగా అహర్నిశలు భరతమాత సేవలో తరించిన కర్మయోగి అని అన్నారు.భారతీయ జనతా పార్టీ మెరు శిఖరం, బీజేపీ కార్యకర్తలకు మార్గ దర్శకులు,స్ఫూర్తి ప్రధాత అటల్ బిహారి వాజ్ పేయి అని కొనియాడారు.అలాంటి మహోతన్నత వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుందని ఆయన దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎన్నటికి మారువరని ఇప్పుడున్న కార్యకర్తలకు,యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్,రవి గౌడ్, వర ప్రసాద్,మణిక్ రావు, బాబు రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, కళ్యాణ్, రామకృష్ణ, విజేందర్, గణేష్ ముదిరాజ్, జాజిరావ్ శ్రీను, వినోద్ యాదవ్, అంజయ్య,నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.