పేదింటి పెద్ద బాపు కేసీఆర్
నేటితో కల్యాణ లక్ష్మీ పథకానికి 12 ఏళ్లు
పటాన్చెరులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
తులం బంగారం హామీని తుంగలో తొక్కారు
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను నిలిపి వేసేందుకు కుట్ర
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ పథకాన్ని అందించి, పెద్ద కొడుకులా, మేనమామలా అండగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.కల్యాణ లక్ష్మీ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం పటాన్చెరువు డివిజన్ పరిధిలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటి సారిగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన మహోన్నత నాయకుడు కెసిఆర్ అని అన్నారు. 2014 నుండి 2023 వరకు లక్షల మంది నిరుపేద ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం వరప్రదాయినిగా నిలిచిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయినా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కల్యాణ లక్ష్మీకి అదనంగా తులం బంగారం అందించలేదని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కోర్టు కేసులను సాకుగా చూపుతూ తప్పించుకోవడం సరికాదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని, కల్యాణ లక్ష్మీ పథకం కింద అందించే ఆర్థిక సహాయానికి అదనంగా హామీ ఇచ్చిన తులం బంగారాన్ని కూడా అందించాలని డిమాండ్ చేశారు.తప్పుడు హామీలు, వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వాన్ని నిద్రలేపి, ఎన్నికల హామీలను గుర్తు చేసేందుకే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…