జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి…
– మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హారిక
పటాన్ చెరు:
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హారిక విజయ్ అన్నారు.
సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని టిఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని ప్రజలను చైతన్య పరిచారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, పట్టణ అధ్యక్షులు అప్జల్, నాయకులు విజయ్, మాజీ వార్డు కమిటీ సభ్యులు చంద్రశేఖర్, మతిన్, వీరారెడ్డి,రాజు తదితరులు పాల్గొన్నారు.