Telangana

అభ్యాస అనుభవాన్ని పొందిన ఆవిష్కార్ విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆవిష్కార్ జూనియర్ కళాశాల విద్యార్థులు, వారి అధ్యాపకులతో పాటు హెదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం సందర్శించి విలువైన అభ్యాస అనుభవాన్ని పొందడంతో పాటు నాణ్యమైన విద్య, పరిశోధన, కార్యనిర్వాహక శిక్షణ ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని పొందారు. గీతం విద్యా సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.మూడు బృందాలుగా విభజించిన సుమారు 275 మంది 12వ తరగతికి చెందిన ఎంపీసీ విద్యార్థులు గీతమ్లోని వివిధ విభాగాలు, మౌలిక సదుపాయాలు, అధునాతన ప్రయోగశాలలు, అత్యాధునిక గ్రంథాలయం వంటి వాటిని సందర్శించారు. ఇందులో భాగంగా ఏరో క్లబ్, జీ ఎలక్ట్రా, నెహ్రుణ్యాభివృద్ధి కేంద్రం, సివిల్, మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ల్యాబ్లను కూడా చూసి, పలు వివరాలు తెలుసుకున్నారు.కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి. రామశాస్త్రి గీతం, దాని విభిన్న కార్యక్రమాల గురించి వివరించారు. ఆయా విభాగాలపై లోతైన అవగాహనను అందించడంతో పాటు ప్రతి విభాగంలోని ప్రత్యేకతలు, కెరీర్ అవకాశాలను వివరించారు. ఈఈసీఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కె. మంజునాథాచారి వందన సమర్పణ చేశారు. డాక్టర్ ఆరిఫ్ మహ్మద్ అబ్దుల్, డాక్టర్ కె.ప్రవీణ్ కుమార్, హెచ్. రవి తదితరులు ప్రయోగాత్మక అనుభవ కార్యకలాపాలను ఈ సందర్భంగా నిర్వహించారు. లిబరల్ ఎడ్యుకేషన్పై సెన్స్డ్ అధ్యాపకులు చర్చాగోష్ఠిని నిర్వహించి, చక్కటి విద్య ప్రాముఖ్యత, వ్యక్తిగత-వృత్తిపరమైన వృద్ధిపై దాని ప్రభావాలను విడమరిచి చెప్పారు.గీతం హెదరాబాద్ అడ్మిషన్స్ విభాగాధిపతి డాక్టర్ కె. శివకుమార్, ఆయన సహోద్యోగి ఎన్.శివమల్లికార్జున రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఆవిష్కార్ విద్యార్థులను గీతము స్వాగతించడం ఆనందంగా ఉందని, నాణ్యమైన విద్య, వివిధ రంగాలలోని అపార కెరీర్ అవకాశాలు జూనియర్ కళాశాల విద్యార్థులకు తెలియజేశా మన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago