పనుల్లో వేగం పెంచాలి….
– కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్ చెరు:
డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
సోమవారం డివిజన్ పరిధిలోని కటిక బస్తి లో మంజూరైన సిసి రోడ్లు ,నూతన డ్రైనేజీ లైను పనులు మందకొడిగా సాగుతున్న విషయాన్ని గమనించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి పనులలో వేగం పెంచేలా చూడాలని అధికారులకు తెలిపారు.
అదేవిధంగా శాంతినగర్ గౌతం నగర్ కాలనీ లో పర్యటించారు. కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కార్పొరేటర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో మాట్లాడి నూతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మించుటకు ఆదేశాలు ఇవ్వాలని, నూతన డ్రైనేజీ ఏర్పడితే కాలనీలో సమస్య ఉండదని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
