Telangana

తెలంగాణ పండుగ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం సినీనటి పాయల్ రాజపుత్

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ పండుగ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టంమని సినీనటి పాయల్ రాజపుత్ అన్నారు .సంగారెడ్డి లో శనివారం సీబీఎస్‌ (చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ను సినీనటి పాయల్ రాజపుత్ ప్రారంభించారు అనంతరం పాయల్ రాజపుత్ మాట్లాడుతూ సంగారెడ్డి కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్‌ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్‌ కాస్ట్యూమ్స్‌ కోసం తాను సీబీఎస్‌లోనే షాపింగ్‌ చేస్తానని తెలిపారు. ఇక్కడ లభించే డిజైన్లు, వెరైటీలు ప్రత్యేకంగా ఉంటాయని, అందుకే సీబీఎస్‌ తనకు ఎంతో ఇష్టమైన షాపింగ్‌ డెస్టినేషన్‌గా మారిందన్నారు.సీబీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌జానా సురేష్‌ మాట్లాడుతూ 40 ఏళ్ల అనుబంధంతో తమ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోందన్నారు. తాము ప్రారంభించిన ప్రతి షోరూంకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. సంగారెడ్డి ప్రజల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి షోరూంను తీర్చిదిద్దినట్లు ఇప్పుడు సంగారెడ్డి ప్రజల కోసం దసరా డబుల్ ధమాకా సేల్‌ తీసుకొచ్చాము అని తెలిపారు.అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలతో పాటు ఆధునిక ఫ్యాషన్‌ దుస్తులను అందించడమే తమ లక్ష్యమన్నారు. అదే తమ విజయ రహస్యమని తెలిపారు. దసరా, దీపావళి పండుగలతో పాటు షోరూం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని *ప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు* అందిస్తున్నట్లు వెల్లడించారు.ప్రారంభోత్సవం సందర్భంగా షోరూంలో భారీగా కస్టమర్లు సందడి చేశారు. ముఖ్యంగా మహిళలు ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ చీరలు, ఇతర వస్త్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దీంతో షోరూం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.

 

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

12 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

16 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

18 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

18 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

18 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago