గీతం ముఖాముఖిలో ఎమోరీ విశ్వవిద్యాలయ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సింగ్లా
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రజారోగ్యం, పరిశోధనా రంగాలలో ఫార్మసీ విద్యార్థులకు విశ్వవ్యాప్తంగా అపార అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయ భారతీయ పరిశోధనా, విద్యా ఆవిష్కరణల డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సింగ్లా అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాధును ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో డాక్టర్ నిఖిల్ పలు అంతర్దృష్టులను పంచుకున్నారు. విద్యార్థుల పరిధిని విస్తృతం చేసేందుకు, వారి విద్యా, వృత్తిపరమైన విషయాలలో అంతర్జాతీయ అవకాశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.ఎమోరీ విశ్వవిద్యాలయంతో సహకారం కోసం ప్రయత్నిస్తున్నామని, రెండు సంస్థలలో విద్యానుభవాలను పెంపొందించే, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉమ్మడి పరిశోధనా కార్యక్రమాలు చేపట్టే వీలుందని ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్ దాస్ పేర్కొన్నారు. ‘మా అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఈ పరస్పర చర్య ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది’ అని డాక్టర్ దాస్ అన్నారు.ఎమోరీ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐవోన్ ఫోసీ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిసాల్ డాక్టర్ కె.శివకుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్మసీ అధ్యాపకులు డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ పవన్ కుమార్ దీనిని సమన్వయం చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…