పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అమెరికా, టీవీస్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని ఫార్మకాలజీ విభాగానికి ప్రొఫెసర్ జోహన్నెస్ డబ్ల్యూ.హెల్, డాక్టర్ మేరీ సి.హార్న్ లు గురువారం గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆతిథ్య. ఉపన్యాసం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ‘కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, అటెన్షన్ లో ఎల్-టెస్ట్ సీఏ ఛానెల్ CaV1.2 యొక్క అడ్రినెర్జిక్ రెగ్యులేషన్’ అనే అంశంపై ప్రొఫెసర్ జోహన్నెస్ డబ్ల్యూ, హెల్, ‘న్యూరోనల్ మెచ్యూరేషన్లో వైవిధ్య సైకెన్, -కాచెనిన్ ఇంటరాక్టింగ్ ప్రాచీన్, సెక్షన్ జీ2 యొక్క సంభావ్య పాత్ర’ అనే అంశంపై డాక్టర్ మేరీ సి.హార్న్ ప్రసంగించారు. తాము గత రాత్రి హైదరాబాద్ సందర్శించామని, అది తమను ఎంతో ఆకట్టుకున్నదని వారు చెప్పారు. ఇక్కడి నుంచి అమృత్ సర్ సందర్శనకు వెళుతున్నట్టు తెలిపారు.తొలుత, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథులను స్వాగతించి, సత్కరించగా, స్కూల్ ఆఫ్ లోని బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధృభజ్యోతి చౌదరి వందన సమర్పణ చేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…