Districts

ఉల్లాసంగా బీ.ఆప్టోమెట్రీ ‘ ఫ్రెషర్స్ డే ‘….

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని తొలి బ్యాచ్ బీ . ఆప్టోమెట్రీ విద్యార్థులు ‘ ప్రెషర్స్ డే ‘ వేడుకలను శుక్రవారం ఉల్లాసంగా , ఉత్సాహంగా జరుపుకున్నారు . విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించే వీలును ఈ వేడుకల నిర్వహణ ద్వారా అధ్యాపకులు కల్పించారు . బెరుకుగా ప్రాంగణంలోకి అడుగిడిన విద్యార్థులకు లభించిన ఈ సాదర స్వాగతం వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడించడమే గాక వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా సృష్టించిందనడంలో అతిశయోక్తి లేదు . గణేష ప్రార్థన , స్వాగత నృత్యంతో ఆరంభమైన కార్యక్రమంలో తొలి బ్యాచ్ విద్యార్థులు తమను తాము పరిచయం చేసుకోవడంతో పాటు వారిలో నిబిడీకృతంగా వున్న నృత్యం , సంగీతం , పాటలు , హాస్యం వంటి కళలను వెలికితీసి అందరినీ ఆకట్టుకున్నారు .

ఈ వేడుకల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు అందరికీ తేటతెల్లమయ్యాయి . బీ.ఆప్టోమెట్రీ తొలి బ్యాచ్ అయినా , అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఇతరత్రా వనరులన్నీ సమకూరుస్తున్నామని , వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి నిపుణులుగా ఎదగాలని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అభిలషించారు . సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ , కోపావేశాలను అధిగమించే స్థాయికి ప్రతి ఒక్క విద్యార్థి ఎదగాలని స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు ఉద్బోధించారు .

ప్రస్తుతం తాము సౌకర్యంగానే ఉన్నామనే పరిధిని అధిగమించి ఆకాశమే హద్దుగా ఎదగాలని బ్రయిన్ హోల్డన్ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్ సలహా ఇచ్చారు . కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎం.ఉపేంద్రతో పాటు ఇతర అధ్యాపకులు ప్రోత్సహక వాక్యాలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు . విద్యార్థుల భాగస్వామ్యం , ఉపాధ్యాయుల మార్గదర్శనంలో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి .

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago