పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
కొత్త ఔషధాలను మార్కెట్లలోకి తీసుకురావడానికి అధిక ధర, సుదీర్ఘ ప్రక్రియే పెద్ద సవాళ్లని ఇన్నారురా సెంట్రిఫిక్ ప్రెనేట్ లిమిటెడ్ సీఈవో వ్యవస్థాపకుడు డాక్టర్ నందన్ కుమార్ దుద్దుకూరి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘చిన్న మాలిక్యూల్ ఔషధ ఆవిష్కరణ రంగంలోని సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు.యాంటీబయాటిక్స్క బ్యాక్టీరియాలో పెరుగుతున్న నిరోధకత సవాలును అధిగమించడంతో పాటు ప్రస్తుతం చికిత్స చేయలేని వ్యాధులకు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయవలసిన తక్షణ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రోడాక్ట్స్ ప్రాముఖ్యతను చెబుతూ, ఇది వర్ధమాన ఫార్మసిస్థకు గణనీయమైన నిధుల పొందే వెసులుబాటును కల్పిస్తోందన్నారు.విద్యార్థులు తదుపరి అధ్యయనాలను కొనసాగించాలని, ప్రోడాక్ట్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నివారణకు మార్గం సుగమం అవుతుందని డాక్టర్ దుద్దుకూరి నొక్కి చెప్పారు.తొలుత, ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.ఎస్.కుమార్ అతిథిని స్వాగతించి, సత్కరించారు.
మోహినియాట్టం….
పరిశోధన విద్యార్థిని (రీసెర్చ్ స్కాలర్), దూరదర్శన్లో ‘బీ’ గ్రేడ్ ఆర్టిస్ట్ శ్రీజ శ్రీకాంత్ శుక్రవారం గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లో ‘మోహినియాట్టం’ను ప్రదర్శించి, ఆహూతుల ప్రశంసలందుకున్నారు. ఆనందు మురళి (గాత్రం), టి. అక్షయ (నట్టువాంగం), శ్రీకాంత్ విశ్వనాథన్ (మృదంగం) ఆమెకు సహకరించారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…