Telangana

ఆదర్శ కాలనీగా సీతారామపురం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత

కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలనీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞాపన పత్రం అందించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం బల్దియ అధికారులతో కలసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో సీతారామపురం కాలనీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ సురేష్ ను ఆదేశించారు. పైన పేర్కొన్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. లో వోల్టేజి సమస్య ఎదురు కాకుండా వెంటనే నూతన ట్రాన్సఫార్మర్ర్ల బిగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే దానికి సార్థకత చేకూరూతుందని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు, కాలనీ సంక్షేమ సంఘం, ప్రతినిధులు కాలనీవాసులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

17 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

19 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago