Telangana

పటాన్‌చెరులో ఘనంగా ఆషాఢ బోనాల పలారం బండి ఊరేగింపు

ఇస్నాపూర్, పటాన్ చెరు లోని పలు పలారం బండి ఉత్సవాలలో పాల్గొన్న

మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు పట్టణంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆషాఢ మాస బోనాల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మధు ముదిరాజ్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ మన్నే రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి వేడుకలకు నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పటాన్‌చెరు పట్టణంలో యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గోకుల్ యూత్, గోనెమ్మ బస్తి, జూనియర్ బాయ్స్ యూత్ మరియు వివిధ కాలనీల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండ్ల ఊరేగింపుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని అన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను, యూత్ సభ్యులను ఆయన అభినందించారు అనంతరం జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు నరసింహ రెడ్డి నివాసంలో తేనీటి విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎన్ టియుసి జిల్లా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, నాయకులు కాసాని వీరేష్, కౌన్సిలర్స్ గోపాల్ రెడ్డి, సంగన్నగారి గోపాల్, దస్తగిరి, సంపత్ రెడ్డి, వెంకటేష్ నాయక్, సందీప్ గౌడ్, నారాయణదాసు, మణికంఠ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యూత్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago