నూతన విద్యార్థులను స్వాగతించిన స్కూల్ ఆఫ్ బిజినెస్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ బిజినెస్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో 2026-27 బ్యాచ్ కు ఘనంగా ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించి, నూతన విద్యార్థులను ఘనంగా స్వాగతించాయి.సంగీతం, నృత్యం, స్కిట్లు, ర్యాంప్ వాక్ లు, విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో గీతం ప్రాంగణమంతా కళకళలాడింది. ఫుడ్ స్టాల్స్, ఆటలు, ఫోటోబూత్ లు పండుగ వాతావరణాన్ని మరింత పెంచాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఫ్రెషర్స్ కు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, తోటి విద్యార్థులు, సీనియర్లతో మమేకమవ్వడానికి ఒక అవకాశాన్ని కల్పించాయి.విద్యార్థులు నేర్చుకోవడానికి, ఒకరితో ఒకరు మమేకమవ్వడానికి, తమను తాము వ్యక్తీకరించుకోవడానికి, చిరస్మరణీయమైన జ్జాపకాలను నిర్మించుకోవడానికి ప్రోత్సహించే ఉత్సాహభరితమైన ప్రాంగణ వాతావరణాన్ని సృష్టించాలనే గీతం నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.తమ విశ్వవిద్యాలయ ప్రయాణానికి ఒక చిరస్మరణీయమైన ఆరంభాన్ని అందించినందుకు ఫ్రెషర్స్ తమ సీనియర్లకు కృతజ్జతలు తెలియజేయడంతో, ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…