Telangana

గణపతి నవగ్రహ సహిత బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం

కాశీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహా స్వామీజీ ఆధ్వర్యంలో పూజలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని నందిగామ గ్రామంలో శ్రీ దాస ఆంజనేయస్వామి పునఃశ్చరణ మరియు గణపతి నవగ్రహ సహిత బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నందిగామ గ్రామ ప్రజలు అందరు కలిసి ఘనంగా నిర్వహించారు.కాశీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ నాగేంద్ర సరస్వతి వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు, నవగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు, గాన కచేరి,అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాశీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహాస్వామీజీ వీరికి నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్,ఉప సర్పంచ్ గోరెమియా, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఆలయ అధ్యక్షుడు వేణు గౌడ్, మరియు గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు ఆశీర్వచనం అందించారు.అదే విధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాటా సుధారాణి కార్యక్రమంలో పాల్గొని దేవాలయ అభివృద్ధికి తన సహకారం అందిస్తానని తెలిపారు.మూడు రోజులుగా నిర్వహించిన అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమానికి కన్నా విక్రం రెడ్డి, కన్నా తిరుపతి రెడ్డి, వారి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థించామని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ విక్రమ్ గౌడ్, ఉప సర్పంచ్ గోరెమియా, మార్కెట్ కమిటీ చైర్మన్ శివనందం, మాజీ జెడ్పిటిసి బొర్ర సుప్రజ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల ఉమావతి గోపాల్, ఆలయ అధ్యక్షులు వేణుగోడ్ ఆలయ కమిటీ సభ్యులు కుమ్మరి సంగం మాజీ అధ్యక్షులు నర్సింలు, మనోహర్ గౌడ్, కుమ్మరి రాజు, వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago