Telangana

ఘనంగా గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

_ఉప్పొంగిన అభిమానం..

_జనసంద్రంగా పటాన్చెరు..

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

అనునిత్యం అండగా నిలుస్తూ.. తమ కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటున్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి.గురువారం తెల్లవారుజామునే గూడెం మధు నివాసం చేరుకున్న అభిమానులు చాలు వాళ్ళు కప్పి పుష్ప గుచాలో అందిస్తూ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో గల మహదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.

అనంతరం మార్కెట్ రోడ్ లో గల దర్గా, శాంతినగర్ అయ్యప్ప స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం జిఎంఆర్ ఫంక్షన్ హాల్ కు భారీ ర్యాలీగా చేరుకొని, జన్మదిన వేడుకలు నిర్వహించారు. శాంతినగర్లో పార్టీ నాయకులు షకీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ప్రముఖ గాయకుడు గద్దర్ నరసింహ గూడెం మధు జన్మదినం పురస్కరించుకొని పాడిన ప్రత్యేక గీతాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago