Telangana

బయటికెళ్లి ప్రపంచాన్ని అన్వేషించండి

_గీతం తొలి ఏడాది విద్యార్థులకు ఓయో సీజీవో కవికృత్ సూచన

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పార్టన్ నెలకొల్పాలనే ఉత్సుకత ఉన్న విద్యార్థుల ఆలోచనలో స్పష్టత ఉంటే పెట్టుబడి సేకరించడం పెద్ద కష్టమేమీ కాదని ఓయో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ (సీజీవో) కనికృత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ తొలి ఏడాది. ప్రవేశం పొందిన విద్యార్థులతో శుక్రవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. వ్యవస్థాపకులుగా ఎదగాలని అభిలషించే వారు, తమ ఆలోచన సరైనదో, కాదో ముందుగా పరీక్షించుకోవాలన్నారు. తాము విద్యను అభ్యసిస్తున్న ప్రాంగణం వెలుపలికి చెల్లి బయటి ప్రపంచాన్ని అన్వేషించాలని, వినియోగదారులు, భాగస్వాములు, విక్రేతలను కనుగోవాలని, ఆయా అంశాలను తమ అధ్యాపకులతో చర్చించి ప్రయోగాలు ప్రారంభించాలని సూచించారు. అలాగే తాము చేయాలనుకుంటున్న దానిని ఇతర వ్యాపార సంస్థలు ఎలా చేస్తున్నాయో కూడా అధ్యయనం చేయాలన్నారు..ఓయో ఆలోచనలకు సాంకేతిక నైపుణ్యాలను జోడించి వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. తాము ఈ స్థాయికి రావడానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓఢ్యామని, దేశవ్యాప్తంగా ఉన్న తమ నెట్వర్క్ హోటళ్లపై బోర్డులు పెట్టడం, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులపై చిన్న బూత్లు పెట్టి బుకింగ్ చేయడం ద్వారా ప్రాచుర్యం పొంది, వినియోగదారుల మన్ననలను చూరగొన్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఓయోలో తన ప్రస్థానం గురించి చెబుతూ, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, వైఫల్యాల మంచి నేర్చుకుంటూ నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉన్నామని చెప్పారు. ‘వెఫల్యాలను సునాయాసంగా స్వీకరించండి, నేర్చుకుంటూ ఉండండి, సమతుల్య విధానాన్ని కొనసాగించండి’ అని కనిర్బత్ సూచించారు.కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవాలనేది తన అభిలాష అయినా, ఫైన్స్ చదివానని, తన వృత్తిజీవన ఆరంభంలోనే వ్యాపార అభ్యాసంలోకి అడుగిడినట్టు ఓయో సీజీవో చెప్పారు. జీవితాన్ని క్రికెట్ బంతితో పోలుస్తూ, ఆ బంతిని ఆడడమే. జీవితం అనే హార్డ్వేరు కూడా తాను నేర్చుకున్నట్టు విద్యార్థుల వార్షధ్వానాల మధ్య ప్రకటించారు. సోషల్ మీడియా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానిని తెలివిగా, అవసరమైన మేరకే వినియోగించుకోవాలని, నీలయినంత వరకు దూరంగా ఉండడమే మేలన్నారు.

ఓయో సేవలపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయని, వినియోగదారుల నుంచి నేరుగా అంటే ప్రతిస్పందనను సమీక్షించి, తదనుగుణంగా నోటల్ ర్యాంకింగ్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కవికృత్ చెప్పారు. విద్యార్థులను ప్రశ్నలడిగేలా ప్రోత్సహిస్తూనే, వారిని ఆకట్టుకునేలా జవాబులిచ్చారు.వర్ధమాన వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా సాగిన ఈ కార్యక్రమం ప్రాంగణాల వెలుపల ప్రపంచాన్ని అన్వేషించడానికి ప్రేరణనివ్వడంతో పాటు స్పష్టత ప్రాముఖ్యత, ఆవిష్కరణల పట్ల ఉత్సాహలను సించిందనడంలో అతిశయోక్తి లేదు.కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ) విజిటింగ్ ఫ్యాకల్టీ కవితా శర్మ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ డెరెక్టర్ ప్రొఫెసర్ వినయ్ కుమార్ అతిథిని సత్కరించారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago