మామిడి కాయల కోసం వెళ్లి…
– ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి పడి వ్యక్తి మృతి
పటాన్ చెరు:
మామిడి కాయల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వీరేశం గౌడ్ అనే వ్యక్తి మామిడి కాయల కోసమని ఇంటి నుంచి బయటకి వెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
శ్మశాన వాటికలోని మామిడి చెట్టు ఎక్కి జారిపడగా… తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
