Telangana

గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026

జాతీయ విద్యార్థి పిచింగ్ పోటీకి దరఖాస్తుల స్వీకరణ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

స్మార్ట్ ఐడియాథాన్ గా పేరొందిన గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026, తన జాతీయ విద్యార్థి పిచింగ్ పోటీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వినూత్న ఆలోచనలు, ప్రారంభ దశలో ఉన్న వెంచర్లను ప్రదర్శించడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఇది ఆహ్వానిస్తోంది. ఈ పోటీని గీతం ఐ-టీబీఐ, గీతం టెక్, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్, వధ్వాని ఫౌండేషన్, అమెరికాలోని బాలవికాస్ సహకారంతో గీతం వెంచర్ డెవలప్ మెంట్ సెంటర్ (వీడీసీ), హైదరాబాదు, గీతం ఎంటర్ ప్రెన్యూర్స్ క్లబ్ (ఇ-క్లబ్) నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.ఏడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ పోటీ ఆరేళ్లుగా విద్యార్థుల భాగస్వామ్యం, భారతదేశ వ్యాప్తంగా వచ్చిన వేలాది దరఖాస్తుల అనుభవంపై ఆధారపడి ఉంది. 2026 ఎడిషన్, ₹5.9 లక్షలకు పైగా నగదు బహుమతులు, ₹44 లక్షలకు పైగా విలువైన వెంచర్ కోచింగ్, మెంటార్ షిప్, ఇంక్యుబేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రోగ్రాములతో సహా మొత్తం ₹50 లక్షలకు పైగా నగదు బహుమతులు, ఎకోసిస్టమ్/ప్రోగ్రామ్ లను అందిస్తోంది.

ఈ పోటీ రెండు విభాగాలలో నిర్వహిస్తారు. జూనియర్ ట్రాక్ 10-12 తరగతుల విద్యార్థుల కోసం కాగా, మెయిన్ ట్రాక్ 2025 సంవత్సరం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఉద్దేశించారు. ఇందులో పాల్గొనేవారు ప్లానెట్ అండ్ సస్టైనబిలిటీ, బయో ఎకానమీ అండ్ అగ్రికల్చర్, డీప్ టెక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పోర్ట్స్ అండ్ ఫిట్ నెస్, డీ2సీ అండ్ కన్స్యూమర్ బ్రాండ్స్ అనే ఐదు ఇతివృత్తాలలో కాన్సెప్ట్, ప్రోటోటైప్ లేదా మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్ (ఎంవీపీ) దశలో తమ ఆలోచనలను ప్రదర్శించవచ్చు.తొలుత ఆన్ లైన్ స్క్రీనింగ్, మెంటరింగ్ రౌండ్లలలో పాల్గొంటారు. జూనియర్ ట్రాక్ లో భాగంగా, బెంగళూరు, హైదరాబాదు, విశాఖపట్నంలో కొత్తగా ప్రత్యక్ష ప్రాంతీయ రౌండ్లు కూడా ఉంటాయి. ఈ పోటీ డిసెంబర్ 11, 2026న గీతం హైదరాబాదులో జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. అక్కడ షార్ట్ లిస్ట్ అయిన ఫైనలిస్టులు, వ్యవస్థాపకులు, పెట్టుబడి దారులు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ నాయకులతో కూడిన జ్యూరీ ముందు తమ వెంచర్లను ప్రదర్శిస్తారు.

పిచింగ్ రౌండ్లతో పాటు, పాల్గొనేవారికి వ్యవస్థాపకులు, స్టార్టప్ స్థాపకులతో సంభాషించడానికి, వ్యవస్థాపకత సెషన్లలో పాల్గొనడానికి ఆన్ లైన్ బూట్ క్యాంపుల ద్వారా వ్యక్తిగత కోచింగ్ పొందడానికి, విస్తృత స్టార్టప్ ఎకోసిస్టమ్ లో సంబంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి.దరఖాస్తులు అక్టోబరు 4, 2026 వరకు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం జూనియర్ ట్రాక్ కు ఒక్కో జట్టుకు ₹499, మెయిన్ ట్రాక్ కు ఒక్కో జట్టుకు ₹699 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది వీడీసీ, ఈ-క్లబ్ ప్రయత్నాలలో ఒక భాగం, ఇది విద్యార్థులకు మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్, పరిశ్రమ భాగస్వామ్యం, విస్తృత స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేయడానికి ధృవీకరించడానికి, ముందుకు తీసుకువెళ్ళడానకి అవకాశాలను కల్పిస్తుంది.వివరాల కోసం gic.gitam.eduను సందర్శించాలి. దరఖాస్తులను https://gevents.gitam.edu/registration/ ODkyMg లింక్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

18 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

20 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

20 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

20 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago