Telangana

గీతం స్కాలర్ చిద్విలాస్ కూరపాటికి పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ,హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి చిద్విలాస్ కూరపాటిని. డాక్టరేట్ వరించింది. ‘క్రోమోన్ డెరివేటివ్ ల సంశ్లేషణ: భవిష్య క్యాన్సర్ నిరోధక కీమోథెరఫీ పద్ధతి అభివృద్ధి, జీవ మూల్యాంకనం’ అనే అంశంపై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జి.రాంబాబు శనివారం విడుదల చేసిన ప్రకటనలో’ ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ పరిశోధనలో, జీవశాస్త్రపరంగా చురుకైన సహజ ఉత్పత్తి అయిన పొంగరోటిన్ ఉత్పత్తికి నూతన సింథటిక్ మార్గాన్ని కనుగొనడమే గాక స్పిరో-క్రోమోన్ హైడ్రాక్సిమిక్ యాసిడ్ డెరివేటివ్ లను రూపొందించి, సంశ్లేషణ చేసినట్టు తెలిపారు. హెచ్ డీఏసీ-6, 8 ఎంజైమ్ లకు వ్యతిరేకంగా వాటి జీవసంబంధ కార్యకలాపాలను విశ్లేషించారన్నారు. నానోమోబార్ సాంద్రతలలో ఈ ఎంజైమ్ లపై గణనీయమైన నిరోధక ప్రభావాలను ప్రదర్శించే మూడు సమ్మేళనాల ఆవిష్కరణకు దారితీసినట్టు తెలియజేశారు. చిద్విలాస్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ సబ్బాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజు, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

11 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

13 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago