Hyderabad

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి :

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ప్రజాభిప్రాయంతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మేయర్ నిర్లక్ష్యంగా బీజేపీ కార్పోరేటర్ల కు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవకుండా అవమానించారని నగర బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు. తాము మెమోరాండం ఇద్దామని వస్తే ఆరోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడం మేయర్ కు తగదన్నారు

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఎనిమిది నెలల్లో ఒకసారి కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. డివిజన్లలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల నుండి రోజు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామని తెలిపారు. నిధులు విడుదల కాకా మధ్యలోనే కాంట్రాక్టర్లు పనులను ఆపేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే నిధులు విడుదల కాక అప్పులపాలై ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

కార్పొరేటర్‌లను ఎమ్మెల్యేలు, అధికారులు గుర్తించే పరిస్థితి లేదన్నారు. మరుగుదొడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు చూసుకునే వర్కర్లుగా కార్పొరేటర్‌ల పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను గెలిపించారనీ, వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇలా అయితే ప్రజలకు ఎం సమాధానం చెప్తామని ప్రశ్నించారు.వారం రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోతే నిరంతరంగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు సునీత ప్రకాష్ గౌడ్,సుప్రియ గౌడ్,రవి చారీ,వినయ్ కుమార్,రాంచన శ్రీ,, సరళ,సుచరిత,దీపికా,అరుణ, భాగ్యలక్ష్మి బొక్క,అలె భాగ్య లక్ష్మి,జంగం శ్వేతా,వెంకటేష్, లక్ష్మి గౌడ్,ఉమా రాణి,అమృత,వెంకట్ రెడ్డి,శంకర్ యాదవ్,లాల్ సింగ్,శశికళ,బోణీ దర్శన్,కరుణాకర్,స్రావం,సునీత,రాజ్య లక్ష్మి,చంద్ర రెడ్డి,మహేందర్,హరీష్,శ్రీవాణి బండారు,రాధా ధీరజ్ రెడ్డి,ఆకుల శ్రీవాణి,సంగీత,తోకల శ్రీనివాస్ రెడ్డి,అర్చన,లేచి రెడ్డి,రంగ నర్సింహా గుప్త, వంగ మధుసూదన్ రెడ్డి,ప్రేమ్ మహేష్ రెడ్డి,సుజాత,కళ్లెం నవజీవం రెడ్డి, పవన్ కుమార్ ముదిరాజ్,కొప్పుల నర్సింహా రెడ్డి,చింతల అరుణ యాదవ్,ర్ వెంకటేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇక చదవండి

వివేకానంద బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దేవేందర్ రాజు 

పటాన్చెరు లో ఘనంగా విజయదశమి వేడుకలు

 

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago