త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం….
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో స్మశానవాటిక నిర్వహణపై కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనిషి తన జీవితకాలంలో చివరి మజిలీనీ ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటారని, ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా రుసుములు నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే స్మశాన వాటికకి సంబంధించి ట్రయల్ పనులు సైతం పూర్తయినట్లు తెలిపారు. కరోనా వైరస్ తో మరణించిన మృతదేహాలకు 7500 రూపాయలు, సహజ మరణాల మృతదేహాలకు ఆరువేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మశాన వాటిక ను నిర్మించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…